నా భర్త పార్టీ మారితే నేను కూడా ఆయనతోనే వెళ్తాను: ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత
- వైసీపీలో ఉండగలిగినంత కాలం ఉంటామన్న సుచరిత
- భార్యగా తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తానని వ్యాఖ్య
- తామంతా వైసీపీ కుటుంబసభ్యులమన్న సుచరిత
తన భర్త ఒక పార్టీలో, తాను మరో పార్టీలో, తన పిల్లలు ఇంకో పార్టీలో ఉండమని తెలిపారు. తామంతా వైసీపీ కుటుంబ సభ్యులమని చెప్పారు. జగన్ పార్టీలో తాము ఉండగలిగినంత కాలం ఉంటామని అన్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.