ఆ చీరకట్టు నా కెరీర్‌లోనే అత్యంత 'ఆల్ఫా' నిర్ణయం: అల్లు అర్జున్
- ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్‌పై మెరిసిన అల్లు అర్జున్
- పుష్పలోని చీరకట్టు గెటప్ తన కెరీర్‌లోనే 'ఆల్ఫా' నిర్ణయమని వెల్లడి
- రొటీన్ లుక్ వద్దని, సుకుమార్ ఆలోచనతోనే ఆ గెటప్ పుట్టిందని స్పష్టీకరణ
- గంటల మేకప్, భారీ నగల వల్ల తీవ్ర నడుము నొప్పితో బాధపడ్డానన్న బన్నీ
- అల్లు అర్జున్ ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
'పుష్ప' చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆయన నటన, మేనరిజమ్స్ ఎంతగా ఆకట్టుకున్నాయో, తిరుపతి గంగమ్మ జాతర నేపథ్యంలో వచ్చే సీక్వెన్స్‌లో ఆయన ధరించిన స్త్రీ వేషధారణ కూడా అంతే సంచలనం సృష్టించింది. తాజాగా ప్రతిష్ఠాత్మక 'ఫోర్బ్స్ ఇండియా' మ్యాగజైన్ కవర్‌పై స్థానం సంపాదించిన అల్లు అర్జున్, ఈ సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆ ఐకానిక్ లుక్ వెనుక ఉన్న శ్రమను, తన ఆలోచనలను పంచుకున్నారు.
ఈ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "ఒక కమర్షియల్ మాస్ హీరో ఇలాంటి డీ గ్లామరైజ్డ్, మహిళా తరహా గెటప్‌లో కనిపించడానికి సాధారణంగా ఇష్టపడరు. కానీ, ఒక నటుడిగా నా కంఫర్ట్ జోన్‌ను దాటి కొత్తదనం చూపించాలనుకున్నాను. నా మొత్తం కెరీర్‌లోనే అత్యంత 'ఆల్ఫా' (ధైర్యంతో కూడిన) నిర్ణయం ఏదైనా ఉందంటే అది 'పుష్ప'లో చీరకట్టుకుని, స్త్రీ వేషధారణ వేయడమే" అని స్పష్టం చేశారు. ఇమేజ్ చట్రాలను పక్కనపెట్టి కథ కోసం రిస్క్ తీసుకోవడం వల్లే ఆ పాత్రకు దేశవ్యాప్తంగా అంతటి ఆదరణ లభించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ లుక్ పుట్టుక వెనుక దర్శకుడు సుకుమార్ ఆలోచనే కీలకమని బన్నీ వెల్లడించారు. "మొదట పుష్ప పాత్ర కోసం రొటీన్ మాస్, స్టైలిష్ లుక్స్‌తో ఫొటోషూట్ చేశాం. కానీ, అలాంటి లుక్స్‌తో ప్రేక్షకులకు పెద్దగా కిక్ ఉండదని, వారికి ఊహించని షాక్ ఇవ్వాలని సుకుమార్ భావించారు. కథలో బలంగా నిలిచిపోయే ఒక విభిన్నమైన లుక్ కోసం ఆయన పట్టుబట్టారు. ఆ ఆలోచన నుంచే గంగమ్మ జాతర నేపథ్యంలోని ఈ గెటప్ పుట్టింది" అని బన్నీ వివరించారు.
ఈ గెటప్ కోసం తాను శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమించాల్సి వచ్చిందని అల్లు అర్జున్ తెలిపారు. ప్రతిరోజూ షూటింగ్‌కు ముందు దాదాపు రెండున్నర గంటల పాటు ప్రత్యేక మేకప్ వేసుకునేవారని గుర్తుచేసుకున్నారు. భారీ ఆభరణాలు, సంప్రదాయ పద్ధతిలో చీర కట్టుకుని రోజంతా భారీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం వల్ల తీవ్రమైన నడుము నొప్పితో బాధపడినట్లు వెల్లడించారు. ఎలాంటి స్టార్ ఇమేజ్ ఈగోలకు తావివ్వకుండా, కథ కోసం ప్రాణం పెట్టి నటించడం వల్లే పుష్పరాజ్ పాత్ర ఒక క్లాసిక్‌గా నిలిచిందని విశ్లేషకులు సైతం ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన క్లిప్‌ను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకోవడంతో, ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.