భూమి నుంచి నేరుగా అంతరిక్షానికి లిఫ్ట్.. త్వరలో నిజం కానుందా?
- స్పేస్ ఎలివేటర్ నిర్మాణంపై పరిశోధకుల పురోగతి
- 66 వేల మైళ్ల పొడవైన కేబుల్ ప్రతిపాదన
- కేబుల్‌కు పాలీక్రిస్టలైన్ గ్రాఫీన్‌ను పరిశీలిస్తున్న సైంటిస్ట్‌లు
- దక్షిణ కొరియాలో 1,000 మీటర్ల గ్రాఫీన్ తయారీ
- ప్రధాన సవాలుగా మారనున్న అంతరిక్ష వ్యర్థాలు
అంతరిక్షంలోకి వెళ్లాలంటే ఇప్పటివరకు రాకెట్లే ప్రధాన మార్గం. కానీ భవిష్యత్తులో రాకెట్ల అవసరం లేకుండానే భూమి నుంచి నేరుగా అంతరిక్షానికి చేరుకునే అవకాశం ఉందా? శాస్త్రవేత్తలు ఈ ఆలోచనకు మరింత దగ్గరవుతున్నట్లు చెబుతున్నారు. దాదాపు 66 వేల మైళ్ల పొడవైన ‘స్పేస్ ఎలివేటర్’ నిర్మాణానికి అవసరమైన అత్యంత బలమైన పదార్థం విషయంలో పురోగతి సాధించినట్లు పరిశోధకులు చెబుతున్నారు.
స్పేస్ ఎలివేటర్ నిర్మాణం కోసం భూమధ్యరేఖ సమీపంలో ఓ భారీ కేబుల్‌ను ఏర్పాటు చేస్తారు. అది భూమి నుంచి భూస్థిర కక్ష్యను దాటి అంతరిక్షంలోకి విస్తరిస్తుంది. చివర్లో ఉండే కౌంటర్‌వెయిట్ కారణంగా కేబుల్ గట్టిగా ఉంటుంది. ప్రత్యేక వాహనాలు ఈ కేబుల్‌పై పైకి ప్రయాణిస్తాయి. వాటి ద్వారా మనుషులు, సరకు, పరికరాలను అంతరిక్షానికి తరలించవచ్చు.
ఈ కేబుల్ నిర్మాణమే ఇప్పటివరకు అతిపెద్ద సవాలు. ఉక్కు కంటే దాదాపు 100 రెట్లు బలంగా ఉండటంతో పాటు చాలా తేలికగా ఉండే పదార్థం అవసరం. భారీ స్థాయిలో ఉత్పత్తి చేయగలగాలి. ఈ అవసరాలకు ‘పాలీక్రిస్టలైన్ గ్రాఫీన్’ సరైన పదార్థంగా మారొచ్చని ఇంటర్నేషనల్ స్పేస్ ఎలివేటర్ కన్సార్టియం (ఐఎస్ఈసీ) భావిస్తోంది.
గ్రాఫీన్ కార్బన్ అణువులతో ఏర్పడిన అత్యంత పలుచని నిర్మాణం. దాని పాలీక్రిస్టలైన్ రూపాన్ని పెద్ద స్థాయిలో తయారు చేయడం సులభమయ్యే అవకాశం ఉంది. దక్షిణ కొరియాలో ఇంజినీర్లు ఇప్పటికే సుమారు 1,000 మీటర్ల పొడవు, అర మీటరు వెడల్పు ఉన్న పాలీక్రిస్టలైన్ గ్రాఫీన్ నిర్మాణాన్ని తయారు చేసినట్లు ఐఎస్ఈసీ తెలిపింది.
అయితే అంతరిక్ష వ్యర్థాలు మరో పెద్ద ముప్పుగా ఉన్నాయి. ఉపగ్రహాలు, ఇతర వస్తువులు కేబుల్‌ను ఢీకొంటే భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఒకదానికొకటి రక్షణగా పలు కేబుళ్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి చుట్టూ ప్రత్యేక భద్రతా ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు.
ఈ ఎలివేటర్ అందుబాటులోకి వస్తే అంతరిక్ష ప్రయాణ ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉంది. భూస్థిర కక్ష్య వరకు చేరేందుకు సుమారు రెండు వారాలు పట్టొచ్చని అంచనా. అక్కడి నుంచి సరుకును గంటకు దాదాపు 16 వేల మైళ్ల వేగంతో అంతరిక్షంలోకి పంపవచ్చు. చంద్రుడిని 14 గంటల్లో చేరే అవకాశం ఉండొచ్చని ఐఎస్ఈసీ అంచనా వేస్తోంది.
అయితే ఇది ఇప్పటికీ పరిశోధన దశలోనే ఉంది. నిర్మాణం ప్రారంభించినా పూర్తయ్యేందుకు దశాబ్దం నుంచి రెండు దశాబ్దాలు పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక సవాళ్లతో పాటు భారీ పెట్టుబడులు అవసరం కావడం మరో సమస్య. అయినా ఈ ఆలోచన నిజమైతే అంతరిక్ష ప్రయాణంలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా నిలిచే అవకాశం ఉంది.