పెట్రోల్ బాంబు విసిరింది కొడాలి నాని అనుచరులే: రావి వెంకటేశ్వరరావు
- రంగా వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఉద్రిక్తత
- కొడాలి నాని రూ. 5 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న రావి
- పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు
వంగవీటి మోహన రంగా స్ఫూర్తితో గుడివాడలో రౌడీయిజాన్ని అంతమొందిస్తామని చెప్పారు. నిన్న రాత్రి గుడివాడలో పెట్రోల్ బాంబు విసిరింది కొడాలి నాని అనుచరులేనని అన్నారు. ఇంకోసారి టీడీపీ జనాల జోలికి వస్తే కొడాలి నాని నాలుక కోసేస్తామని హెచ్చరించారు. గుడివాడలో దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.