కేవైసీ కోసం కష్టాలు.. ఈశాన్య రాష్ట్రాల వారిని గుర్తించని టెక్నాలజీ?.. మంత్రి షేర్ చేసిన వీడియో వైరల్!
- నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్ షేర్ చేసిన వీడియో వైరల్
- కేవైసీ కోసం ఫేషియల్ రికగ్నిషన్‌లో ఈశాన్య ప్రాంత వ్యక్తి ఇబ్బందులు
- టెక్నాలజీలోని లోపాలపై నెట్టింట మొదలైన చర్చ
- వేలిముద్రల వంటి ప్రత్యామ్నాయాలు సూచిస్తున్న నెటిజన్లు
- హాస్యంతోనే తీవ్రమైన సమస్యను ప్రస్తావించారని మంత్రిపై ప్రశంసలు
నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ సరదా వీడియో, ఇప్పుడు టెక్నాలజీ పరిమితులపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చనకే దారితీసింది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ పదేపదే విఫలమవడంతో కేవైసీ పూర్తి చేయడానికి ఓ వ్యక్తి పడుతున్న ఇబ్బందులను ఈ వీడియో హాస్యభరితంగా చూపిస్తుంది. ఈ వీడియోకు ఇప్పటికే 3.5 లక్షలకు పైగా వ్యూస్, 10,000కు పైగా లైకులు వచ్చాయి.
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలందరూ ఒకేలా కనిపిస్తారనే మూస ధోరణి ఆధారంగా ఈ వీడియో ఉన్నప్పటికీ, మంత్రి దానికి హాస్యాన్ని జోడించి 'స్ట్రగుల్ ఈజ్ రియల్' (ఈ కష్టం నిజమైనది) అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. వీడియోలో కేవైసీ కోసం ఫొటో తీసుకుంటున్న వ్యక్తి కళ్లు సరిగ్గా కనిపించేలా చేయడానికి, గ్రామస్థులు ఆయన కనురెప్పలను పట్టుకుని సాగదీయడం నవ్వు తెప్పిస్తుంది.
అయితే, ఈ హాస్యం వెనుక ఉన్న తీవ్రమైన సమస్యను నెటిజన్లు వెంటనే గుర్తించారు. టెక్నాలజీలోని లోపాలను ఎత్తిచూపుతూ, దీనికి సరైన పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. "సమస్య టెక్నాలజీది, మీది కాదు. భారతీయులందరినీ దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించలేదు" అని ఒక యూజర్ కామెంట్ చేశారు.
కొందరి కళ్ల నిర్మాణం ప్రత్యేకంగా ఉండటం వల్ల ఈ సమస్య వస్తోందని, ఇలాంటి వారికి ఐరిస్ స్కాన్ చేసేందుకు ఎలాంటి స్కానర్లు అందుబాటులో ఉన్నాయో చెప్పాలంటూ మరో యూజర్ ఏకంగా 'ఎక్స్' ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ 'గ్రాక్'ను ప్రశ్నించడం విశేషం. "ప్రజలు తమ సహజ శారీరక లక్షణాల వల్ల ఇబ్బంది పడకూడదు. వేలిముద్రల వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను అనుమతించాలి" అని మరికొందరు సూచించారు. చైనా, జపాన్ వంటి దేశాలు ఇలాంటి సమస్యలకు ఇప్పటికే పరిష్కారాలు కనుగొని ఉంటాయని, భారత ప్రభుత్వం వాటిని ఎందుకు స్వీకరించకూడదని ఇంకొందరు ప్రశ్నించారు.
కాగా, నాగాలాండ్ మంత్రి టెంజెన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో తరచూ ఇలాంటి సరదా, ఆలోచింపజేసే వీడియోలు పంచుకుంటూ ఉంటారు. గతంలో ఇండోర్‌కు చెందిన ఓ ట్రాఫిక్ పోలీస్ మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో డ్యాన్స్ చేస్తూ ట్రాఫిక్ నియంత్రించిన వీడియోను కూడా ఆయన షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మొత్తానికి మంత్రి షేర్ చేసిన ఈ వీడియో ఒక తీవ్రమైన సాంకేతిక సమస్యపై విస్తృత చర్చకు దారితీయడం గమనార్హం.