ఏపీ సీఎస్ గా బాధ్యతలను స్వీకరించిన కేఎస్ జవహర్ రెడ్డి
- సమీర్ శర్మ నుంచి సీఎస్ గా బాధ్యతలను స్వీకరించిన జవహర్ రెడ్డి
- ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసిన కొత్త సీఎస్
- 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి
ముఖ్యమంత్రి నేతృత్వంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తానని చెప్పారు. జవహర్ రెడ్డి 1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. సీఎం జగన్ కు ఆయన ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. సీఎస్ గా బాధ్యతలను చేపట్టిన జవహర్ రెడ్డికి వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు.