హైకోర్టులో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు భారీ ఊరట
- శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ కేసులో రంగనాథ్‌ను కమిషనర్‌గా తొలగించాలన్న సింగిల్ బెంచ్
- సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేసిన రంగనాథ్
- విచారణ చేపట్టి, సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. రంగనాథ్‌ను కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, లోతుకుంట గ్రామంలోని సర్వే నెంబర్లు 1, 2లలో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ చర్యను సవాలు చేస్తూ శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా గతంలో సింగిల్ జడ్జి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించే అధికారులు చట్టబద్ధమైన పాలనకు ప్రమాదకరమని, అలాంటి వ్యక్తులు బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగకూడదని సింగిల్ జడ్జి అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో 9,290 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉండగా, కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఒక్క రంగనాథ్‌పైనే 63 కేసులు నమోదు కావడం అసాధారణమని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అయితే, సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రంగనాథ్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, తాజాగా డివిజన్ బెంచ్ ఆ తీర్పును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.