వివేకా హత్య కేసు సాక్షులను రక్షించుకోవాలంటే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందే: సీబీఐ
- వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి
- గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్
- గంగిరెడ్డి బయట ఉంటే సాక్షుల ప్రాణాలకు ముప్పేనని వివరణ
- స్థానిక పోలీసులు, నిందితులు కలిసి కేసు ముందుకు సాగకుండా అడ్డుకున్నారని ఆరోపణ
ఈ సందర్భంగా కేసు నిందితులతో పాటు స్థానిక పోలీసులపైనా సీబీఐ న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు. నిందితులు, స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారని, మూకుమ్మడిగా కేసు విచారణ ముందుకు జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. సీబీఐ వాదనలపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది.