ఏపీ జెన్‌కోకు బకాయిలు చెల్లించమనడం కచ్చితంగా దేశద్రోహమే: తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి
- ఏపీ సంస్థలు తమకు రూ. 12,941 కోట్లు చెల్లించాలన్న మంత్రి
- మోదీకి ఏపీ రాసిన లేఖలే కనిపిస్తున్నాయని ధ్వజం
- రైతుల మోటార్లకు మీటర్లు బిగించేది లేదని చెప్పడం వల్లే ఈ ఆదేశాలన్న జగదీశ్‌రెడ్డి
- కృష్ణా, గోదావరి జలాల విషయంలోనూ తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడమే కాకుండా పీపీఏ అమల్లోనూ ఏపీ తమకు అన్యాయం చేసిందన్నారు. అయినా సరే కేంద్రం జోక్యం చేసుకోలేదని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేదే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెగేసి చెప్పడంతోనే కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసిందన్నారు. మోదీకి ఏపీ రాసిన లేఖలు తప్ప తెలంగాణ లేఖలు కనిపించడం లేదని విమర్శించారు.
నెల రోజుల్లోగా ఏపీకి బకాయిలు చెల్లించాలని ఆదేశించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. విద్యుత్ రంగంలో కేసీఆర్ సాధించిన విజయాలను కేంద్రం జీర్ణించుకోలేకపోతోందన్నారు. సాగుకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వకుండా అడ్డుకునే కుట్ర ఇందులో కనిపిస్తోందన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలోనూ కేంద్రం ఇలానే వ్యవహరిస్తోందని మంత్రి ఆరోపించారు.