పెళ్లి పీటలెక్కనున్న టీడీపీ యువ నేత కేశినేని శ్వేత!.. వరుడు ఎవరో తెలుసా?
- విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శ్వేత
- కార్పొరేటర్‌గా గెలిచినా టీడీపీ ఓడిపోవడంతో దక్కని పదవి
- కాజా రఘుతో శ్వేత వివాహం ఖరారు
- ఉమ్మడి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామనాథం మనవడే రఘు
తాజాగా కేశినేని శ్వేత వివాహం ఖరారైంది. కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన కాజా రఘుతో ఆమె వివాహం నిశ్చయమైంది. శ్వేత ఫ్యామిలీ మాదిరే రఘు ఫ్యామిలీ కూడా రాజకీయ నేపథ్యం కలిగినదే. ముదినేపల్లి నియోజకవర్గం నుండి ఓ దఫా స్వతంత్ర అభ్యర్థిగా, మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ గా పనిచేసిన కాజా రామనాధం మనవడే రఘు. ఈ మేరకు శ్వేత, రఘుల వివాహ నిశ్చయానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చేరిపోగా... త్వరలోనే ఒక్కటి కానున్న శ్వేత, రఘులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.