ఏపీ లిక్కర్ బాండ్ల వేలానికి యమ గిరాకీ.. క్యూ కట్టిన ఈపీఎఫ్ఓ సహా 26 సంస్థలు
- పారిశ్రామిక దిగ్గజాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆసక్తి
- రూ.5,080 కోట్ల పెట్టుబడికి ఈపీఎఫ్ఓ సంసిద్ధత
- ఆసక్తి వ్యక్తపరచిన సంస్థల్లో ఆదిత్య బిర్లా కూడా
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఏకంగా రూ.5,080 కోట్లను పెట్టుబడిగా పెట్టి ఏపీ లిక్కర్ బాండ్లను కొనుగోలు చేసేందుకు సిద్ధపడిందన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అలాగే, ఇంకా ఈ బాండ్లను కొనుగోలు చేసేందుకు ఆదిత్య బిర్లా, మోర్గాన్ స్టాన్లీ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సహా 26 సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లుగా సమాచారం. వెరసి లిక్కర్ బాండ్ల ద్వారా ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను సమకూర్చుకునే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.