SRH: సన్ రైజర్స్ ఆల్ రౌండ్ షో... చిత్తుగా ఓడిన బెంగళూరు

SRH all round show against RCB
షార్ట్స్‌లో చూడండి
కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ విజయప్రస్థానం కొనసాగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. 69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 8 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (28 బంతుల్లో 47 రన్స్; 8 ఫోర్లు, 1 సిక్స్), కేన్ విలియమ్సన్ (16 నాటౌట్) బెంగళూరు బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. చివర్లో అభిషేక్ శర్మ అవుటైనా, రాహుల్ త్రిపాఠి సిక్సర్ తో విన్నింగ్ షాట్ కొట్టాడు. ఈ విజయంతో సన్ రైజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది.
Go Back to Shorts
SRH
RCB
Chasing
IPL

More Telugu News