నేడు భారీగా తరలింపు.. 19 విమానాల్లో 3,700 మంది విద్యార్థుల రాక
- ఆపరేషన్ గంగా కార్యక్రమం ఉద్ధృతం
- సరిహద్దు దేశాల నుంచి తీసుకొచ్చే ఏర్పాట్లు
- రోడ్డు మార్గంలో విద్యార్థుల తరలింపు
8 విమానాలు బుకారెస్ట్ నుంచి, రెండు విమాన సర్వీసులు సుసేవ నుంచి, కోసీ నుంచి ఒకటి, బుడాపెస్ట్ నుంచి ఐదు, రెస్జోవ్ నుంచి 3 విమాన సర్వీసులు బయల్దేరతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ప్రధాని మోదీజీ ఆదేశాలతో ఒక్కరోజే 3,726 మందిని తరలిస్తున్నట్టు చెప్పారు. జ్యోతిరాదిత్య, మరో మంత్రి కిరణ్ రిజుజు తదితరులతో కూడిన ఉన్నతస్థాయి బృందాన్ని సహాయక చర్యల పర్యవేక్షణ కోసం కేంద్రం పంపడం తెలిసిందే.