పూరీ జగన్నాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం

Puri Jagannadh Family Deeply Saddened as His Mother Passes Away
  • పూరి జగన్నాథ్ తల్లి కన్నుమూత
  • విషాద వార్తను వెల్లడించిన పూరి కూతురు పవిత్ర
  • పూరి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్న సినీ ప్రముఖులు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని పూరీ కుమార్తె పవిత్ర సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్టుతో అభిమానులకు తెలియజేశారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పోస్ట్ నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. తన నానమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పవిత్ర ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోతో పాటు ఆమె రాసిన ఎమోషనల్ సందేశం అందరి హృదయాలను కదిలిస్తోంది.

“ఇప్పుడు నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు? ప్రేమగా నాకెవరు ముద్దుపెడతారు? నీతో మరో రోజు గడిపే అవకాశం వస్తే ఎంత బాగుండేది. నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లే మరోసారి పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ” అంటూ పవిత్ర తన మనసులోని బాధను వ్యక్తం చేశారు. పవిత్ర చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు పూరీ జగన్నాథ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. 

పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిస్తున్న ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. అయితే, సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఈ సమయంలో పూరీ జగన్నాథ్ కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం సినీ వర్గాలను కూడా కలచివేసింది. అభిమానులు, పరిశ్రమకు చెందిన ప్రముఖులు పూరీ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Advertisement
Puri Jagannadh
Puri Jagannadh Mother
Pavithra Puri
Tollywood News
Slumdog 33 Temple Road
Puri Jagannadh Family Tragedy

More Telugu News