గుడివాడలో క్యాసినో వ్యవహారంపై ఢిల్లీలో ఈడీకి ఫిర్యాదు చేసిన రామ్మోహన్ నాయుడు
- క్యాసినోపై విచారణ జరపాలని కోరాం
- గోవా నుంచి యువతులను ఏపీకి తీసుకొచ్చారు
- క్యాసినో, విమాన టికెట్లకు సంబంధించిన పలు ఆధారాలు ఇచ్చాం
- 500 కోట్ల రూపాయలు చేతులు మారాయన్న టీడీపీ నేతలు
ఈడీ అధికారులను కలిసిన అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ... క్యాసినోపై విచారణ జరపాలని కోరినట్లు చెప్పారు. గోవా నుంచి యువతులను ఏపీకి తీసుకొచ్చారని చెప్పారు. ఈడీ విచారణ జరిపితే పూర్తి వివరాలు బయటపడతాయని తెలిపారు. క్యాసినో, విమాన టికెట్లకు సంబంధించిన పలు ఆధారాలను ఈడీకి సమర్పించామని చెప్పారు. పేకాట, డ్రగ్స్, జూదం వంటి కార్యకలపాలతో 500 కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆలపాటి రాజా ఆరోపించారు.