బేగంపేటలో టాలీవుడ్ పబ్ పై పోలీసుల దాడులు

Police raids on Tollywood Pub in Begumpet
  • పబ్ లో అసాంఘిక కార్యకలాపాలు
  • 9 మంది మహిళలు, 33 మంది పురుషుల అరెస్ట్
  • పబ్ నిర్వాహకులపై ఆరోపణలు
  • గతంలో లిబ్సన్ పబ్ పేరిట కార్యకలాపాలు
  • అప్పట్లో పోలీసు కేసుల నమోదు
  • టాలీవుడ్ పబ్ గా పేరు మార్పు
హైదరాబాదులోని ఓ పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది మహిళలు, 33 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అసభ్యకరంగా దుస్తులు ధరించి నృత్యాలు చేసినందుకు మహిళలకు ఒక్కొక్కరికి రోజుకు వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారని పోలీసులు తెలిపారు. పబ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తించామని వెల్లడించారు. టాలీవుడ్ పబ్ నిర్వాహకులు సాయి భరద్వాజ్, వేణుగోపాల్, పబ్ మేనేజర్ రాముపై కేసులు నమోదు చేశారు.

కాగా, బేగంపేటలోని ఈ పబ్ గతంలో లిబ్సన్ పబ్ పేరిట కార్యకలాపాలు నిర్వహించినట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Tollywood Pub
Begumpet
Hyderabad
Police

More Telugu News