బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద స్వల్పంగా గాయపడ్డ చంద్రబాబు

TDP chief Chandrababu injured during his Kuppam tour
  • కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు
  • బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకుని కుప్పంకు రోడ్డు మార్గంలో వెళ్లిన బాబు
  • బాబుతో కరచాలనం చేసేందుకు యత్నించిన టీడీపీ మద్దతుదారులు
తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఉదయం స్వల్పంగా గాయపడ్డారు. కుప్పంకు వెళ్లే క్రమంలో ఈ ఉదయం ఆయన బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన కుప్పంకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు పెద్ద సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు స్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు వారు యత్నించారు.

ఈ క్రమంలో చంద్రబాబు చేతికి అనుకోకుండా స్వల్ప గాయమయింది. ఆ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి కుప్పంకు బయల్దేరి వెళ్లారు. రేపటి వరకు చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగనుంది. ప్రస్తుతం ఆయన కుప్పం బస్టాండ్ సెంటర్ వద్ద ప్రసంగిస్తున్నారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Injury
Bengaluru Airport

More Telugu News