ఉప ఎన్నికలో భారీ ఆధిక్యంతో గెలుపుదిశగా మమతా బెనర్జీ
- 35 వేల ఓట్ల ఆధిక్యంలో మమత
- ప్రస్తుతం 13వ రౌండ్ లో ఓట్ల లెక్కింపు
- మమతా బెనర్జీకి 48,813 ఓట్లు
- బీజేపీ అభ్యర్థి టిబ్రేవాల్ కు 13,843
మమతా బెనర్జీకి 48,813 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి టిబ్రేవాల్ కు 13,843 ఓట్లు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో మిగిలిన రెండు స్థానాలు షంసేర్‌గంజ్, జాంగీపూర్ ఉప ఎన్నికల్లోనూ టీఎంసీ నేతలే ముందంజలో ఉన్నారు. మమతా బెనర్జీ కొన్ని నెలల క్రితం పశ్చిమ బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓడారు. ముఖ్యమంత్రిగా ఆమె కొనసాగాలంటే ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది.