నిరసన తెలిపేందుకు వెళితే నా కారుపై రాళ్లు రువ్వారు: జోగి రమేశ్
- నా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి
- చంద్రబాబే క్షమాపణ చెప్పాలి
- నిరసన కోసం వెళ్తే దండయాత్ర అంటున్నారు
- అయ్యన్న వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలి
ఈ క్రమంలోనే తనపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, తన కారు అద్దాలు ధ్వంసమయ్యాయని జోగి రమేశ్ ఆరోపించారు. తన కారుపై వారు రాళ్లు రువ్వారని, నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. జగన్ పై అయ్యన్న వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.