Allu Arjun: బోయపాటిని లైన్లో పెట్టిన అల్లు అర్జున్!

  • చివరి షెడ్యూల్లో 'పుష్ప'
  • 'ఐకాన్' స్క్రిప్ట్ పై కసరత్తు
  • లైన్లో మురుగదాస్
  • బోయపాటి కథ వైపు మొగ్గు
Allu Arjun in Boyapati movie

అల్లు అర్జున్ కథానాయకుడిగా 'పుష్ప' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా ముగింపుదశకి చేరుకుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 'క్రిస్మస్'కు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత బన్నీ 'ఐకాన్' సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నప్పటికీ, పాన్ ఇండియా మూవీగా ఉండాలనే ఉద్దేశంతో అందుకు తగినట్టుగా మార్పులు .. చేర్పులు చేస్తున్నారట.

అయితే అల్లు అర్జున్ తదుపరి సినిమా బోయపాటి దర్శకత్వంలో ఉండనుందనేది తాజా సమాచారం. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'సరైనోడు' వంటి భారీ హిట్ వచ్చింది. అందువలన ఈ కాంబినేషన్ పై క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే బోయపాటి ఒక కథ వినిపించడం .. అందుకు సంబంధించి ఆయనకి అడ్వాన్స్ ముట్టినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే వేణు శ్రీరామ్ .. మురుగదాస్ సినిమాల తరువాత ఈ ప్రాజెక్టు ఉండవచ్చని అనుకున్నారు. కానీ బోయపాటి కథవైపు మొగ్గు చూపిన అల్లు అర్జున్, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకు వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇది బన్నీ ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగించే విషయమే.

More Telugu News