14 ఏళ్ల బాలికతో పాక్ ఎంపీ సలాహుద్దీన్ అయూబీ వివాహం!
- అక్టోబర్ 2006లో జన్మించిన బాలిక
- ప్రస్తుతం బెలూచిస్థాన్ నుంచి ఎంపీగా ఉన్న సలాహుద్దీన్
- విచారిస్తున్న పోలీసులు
వాస్తవానికి పాకిస్థాన్ లో బాలికలకు 16 ఏళ్లు వచ్చే వరకూ వివాహం చేయరాదు. అంతకన్నా తక్కువ వయసులో పెళ్లి చేస్తే, తల్లిదండ్రులకు కఠిన శిక్షలు పడతాయి. సలాహుద్దీన్ వివాహంపై విచారణ ప్రారంభించిన పోలీసులు, బాలిక తల్లిదండ్రులను విచారించారు. వారు అసలు తమ అమ్మాయికి వివాహమే జరిపించలేదని అఫిడవిట్ ను ఇచ్చినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇక సలాహుద్దీన్ వివాహం చేసుకుంది బాలికనేననే వార్తలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.