వరవరరావుకు బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు!
- దాదాపు ఏడాది పాటు జైల్లో గడిపిన వరవరరావు
- షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి
- పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశం
తనపై ఆరోపణలు ఉన్న కేసు విచారణకు సంబంధించి, పోలీసులకు సహకరించాలని, సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నిస్తే, బెయిల్ ను రద్దు చేస్తామని ఈ సందర్భంగా న్యాయమూర్తి వరవరరావును హెచ్చరించారు. నేటి సాయంత్రం లోగా బెయిల్ పేపర్లను జైలు అధికారులకు అందించి, విడుదలయ్యేలా చూస్తామని ఆయన తరఫు న్యాయవాదులు వెల్లడించారు.