Jr NTR: 'హిట్' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్?

NTR to work with young director
షార్ట్స్‌లో చూడండి
ఎవరైనా కొత్తగా కథ చెబితే చాలు.. ఈవేళ స్టార్ హీరోలు ఆయా దర్శకులకు డేట్స్ ఇవ్వడానికి రెడీగా వున్నారు. గతంలో ఎన్ని సినిమాలు చేశాడు? ఎన్ని విజయాలు అతని ఖాతాలో వున్నాయి? అన్న విషయాలను కూడా పట్టించుకోవడం లేదు. తాజాగా ఎన్టీఆర్ కూడా అలాగే ఓ యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఆమధ్య విష్వక్ సేన్ హీరోగా 'హిట్' చిత్రాన్ని చేసి, హిట్ చేసిన శైలేశ్ కొలను ఇప్పుడు ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసినట్టు చెబుతున్నారు. శైలేశ్ ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఓ కథ చెప్పగా ఆయనకు అది బాగా నచ్చిందట. ఈ కథ ఎన్టీఆర్ కైతే కరెక్టుగా సూటవుతుందని చెప్పిన దిల్ రాజు.. అతనిని ఎన్టీఆర్ వద్దకు తీసుకువెళ్లారట. కథ విన్న ఎన్టీఆర్ వెంటనే శైలేశ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.    

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని పూర్తిచేస్తున్న ఎన్టీఆర్, ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. అలాగే, శైలేశ్ ప్రస్తుతం 'హిట్' చిత్రాన్ని హిందీలో రాజ్ కుమార్ రావ్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. ఈ ప్రాజక్టులు పూర్తయ్యాక, ఎన్టీఆర్ తో శైలేశ్ సినిమా సెట్స్ కి వెళుతుందని అంటున్నారు.
Go Back to Shorts
Jr NTR
Shailesh Kolanu
Rajamouli
Trivikram Srinivas

More Telugu News