మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఉద్ధవ్ కాదు.. శరద్ పవార్: బీజేపీ రాష్ట్ర చీఫ్ పాటిల్
- నాకు తెలిసినంత వరకు రాష్ట్రాన్ని ఏలుతున్నది పవారే
- గవర్నర్ కూడా ఆయన్నే కలవమని రాజ్ థాకరేకు సూచించారు
- నేను రాసిన ఒక్క లేఖకు కూడా సమాధానం లేదు
రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పెంపును నిరసిస్తూ ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే గవర్నర్‌ను కలిశారు. దీంతో శరద్ పవార్‌ను కలవాలని గవర్నర్ కోష్యారీ ఆయనకు సలహా ఇచ్చిన నేపథ్యంలో చంద్రకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్ థాకరేకు గవర్నర్ ఏం చెప్పారన్న విషయాన్ని పక్కనపెడితే తనకు తెలిసినంత వరకు రాష్ట్రాన్ని ఏలుతున్నది శరద్ పవారేనని చెబుతానని పాటిల్ తేల్చి చెప్పారు. గత 9 నెలల్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి తాను బోల్డన్ని లేఖలు రాసినా ఒక్కదానికి కూడా సమాధానం రాలేదని అన్నారు.