ముఖ్యమంత్రి గారూ.. ఈ విషయాన్ని తెగేంత వరకు లాగకండి: వర్ల రామయ్య
- ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య అగాధం నానాటికీ పెరుగుతోంది
- గతంలో, పాక్‌లో రెండు వ్యవస్థల మధ్య వైరం
- అది పెరిగి, రాజ్యాంగ సంక్షోభానికి దారితీసింది
ఈ నేపథ్యంలో వర్ల రామయ్య వీటిపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ‘ముఖ్యమంత్రి గారూ.. రాష్ట్రంలో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య అగాధం నానాటికీ పెరుగుతోంది. చూస్తుంటే, ఈ వ్యవస్థల తీరు, గతంలో, పాకిస్థాన్ లో ముషారఫ్ టైమ్ లో రెండు వ్యవస్థల మధ్య వైరం పెరిగి, రాజ్యాంగ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెగేoత వరకు లాగకండి’ అని వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.