ప్రశాంత్ నీల్ చిత్రంలో మాఫియా డాన్ పాత్రలో ఎన్టీఆర్?
- ప్రశాంత్ నీల్ చిత్రానికి కథ సిద్ధం
- బయోవార్ నేపథ్యంలో సాగే సినిమా
- సరికొత్త మేకోవర్ తో ఎన్టీఆర్ గెటప్
- త్రివిక్రమ్ సినిమా తర్వాత సెట్స్ కి
ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో రూపొందే చిత్రం ఎలాంటి థీమ్ తో సాగుతుందన్న అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సమాచారాన్ని బట్టి, ఈ చిత్రం బయోవార్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ మాఫియా డాన్ పాత్రలో సరికొత్త మేకోవర్ తో కనిపిస్తాడని అంటున్నారు. ఈ గెటప్ కు సంబంధించి వర్క్ కూడా చేస్తున్నారట.
ఇదిలావుంచితే, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. దాని షూటింగ్ ఇంకా మిగిలివుంది. మరికొన్నాళ్లలో ఆ షూటింగును మొదలెడతారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తాడు. ఇక అది చివరి దశలో వుండగా ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది.