Kanakadurga Flyover: విజయవాడకు కంఠహారంలా కనకదుర్గ ఫ్లైఓవర్... డ్రోన్ వ్యూ ఇదిగో!

  • తుదిమెరుగులు దిద్దుకున్న కనకదుర్గ ఫ్లైఓవర్
  • సెప్టెంబరు 4న జాతికి అంకితం
  • ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్, నితిన్ గడ్కరీ
Drone view of Vijayawada Kanakadurga flyover

విజయవాడ వాసులు ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. తుదిమెరుగులు దిద్దుకున్న ఈ విజయవాడ కంఠహారాన్ని సెప్టెంబరు 4న జాతికి అంకితం చేయనున్నారు. ఆ రోజున జరిగే ఓ కార్యక్రమంలో సీఎం జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కనకదుర్గ ఫ్లైఓవర్ కు చెందిన డ్రోన్ వ్యూ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. అన్ని కోణాల్లోంచి చిత్రీకరించిన ఈ వీడియో అచ్చెరువొందిస్తోంది. నిండుకుండలా తొణికిసలాడుతున్న కృష్ణానది పక్కనే ఈ భారీ ఫ్లైఓవర్ శోభాయమానంగా దర్శనమిస్తోంది.


More Telugu News