Amala Paul: బోయపాటి సినిమాలో కథానాయికగా అమలాపాల్?

  • బాలయ్య, బోయపాటి కలయికలో మూడో సినిమా
  • అమలాపాల్ తో ప్రస్తుతం సంప్రదింపులు
  • గత నెలలో వచ్చిన టీజర్ కు మంచి రెస్పాన్స్
Amala Paul is considered for heroine role in Boyapati movie

'సింహా', 'లెజండ్' హిట్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కలయికలో ప్రస్తుతం మూడో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి స్టయిల్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు అమలా పాల్ ఎంపిక అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ పాత్రకు రాశిఖన్నా, కేథరిన్ వంటి పేర్లు నిన్నటి వరకు వినిపించినా వారెవరూ ఫైనల్ కాలేదు. ఈ క్రమంలో తాజాగా అమల పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం చిత్రం యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

కాగా, లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ జరిగింది. ఇప్పుడు మళ్లీ షూటింగును ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, హీరో బాలకృష్ణ మాత్రం మరికొన్నాళ్లు పోయాకనే ఈ షూటింగులో జాయిన్ అవుతారని తెలుస్తోంది. గత నెలలో విడుదలైన ఈ చిత్రం టీజర్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్ సంగీతం దీనికి ఓ హైలైట్ గా చెప్పుకోవచ్చు.

More Telugu News