Crime News: తన భర్త మరో అమ్మాయితో తిరుగుతున్నాడని ఎఫ్‌బీలో వీడియో పోస్ట్ చేసి.. సాఫ్ట్‌వేర్ యువతి ఆత్మహత్య

software girl commits suicide
షార్ట్స్‌లో చూడండి
భర్త వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్‌వేర్‌ యువతి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌లోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటోన్న లావణ్య లహరి అనే సాఫ్ట్‌వేర్‌ యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

భర్త వేధింపుల వల్లే ఆమె ఈ ఘటనకు పాల్పడిందని తెలిసింది. తన ఆత్మహత్యకు తన భర్తే కారణమని పేర్కొంటూ, అంతకుముందు ఆమె ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది. తన భర్త మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఈ నేపథ్యంలోనే తనను వేధింపులకు గురి చేస్తున్నాడని పేర్కొంది.

ఆమెను తీసుకుని ఓ హోటల్‌కు వెళుతుంటాడని తెలిపింది. చాలా కాలం పాటు భరించానని, ఇక భరించలేకపోతున్నానని చెప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. లావణ్య సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఆమె భర్త వెంకటేశంను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన పైలట్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. తమ అల్లుడి వేధింపుల వల్లే కూతురు ఆత్మహత్య చేసుకుందని లావణ్య తల్లిదండ్రులు చెప్పారు. 2012 జులైలో వారు పెళ్లి చేసుకున్నారని తెలిపారు.
           
Go Back to Shorts
Crime News
Hyderabad
Police

More Telugu News