తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... టీచర్లకూ మధ్యాహ్న భోజనం

Telangana Government key decision mid day meals for teachers
  • ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు మధ్యాహ్న భోజనం
  • భోజన నాణ్యత, పర్యవేక్షణ పెంచడమే లక్ష్యం
  • తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం
ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు అందజేసే భోజనం నాణ్యతను పెంచడంతో పాటు, పర్యవేక్షణను మెరుగుపరిచి జవాబుదారీతనాన్ని పటిష్ఠం చేసేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం పీఎం-పోషణ్ (మధ్యాహ్న భోజనం) పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందుతోంది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా అదే భోజనాన్ని స్వీకరించడం వల్ల ఆహార పరిశుభ్రత, పోషక విలువలు మరింత మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధ్యాయుల ప్రత్యక్ష పర్యవేక్షణ ఫలితంగా ఈ పథకం మరింత సమర్థవంతంగా అమలవుతుందని అధికారులు ఆశిస్తున్నారు.
Advertisement
Telangana Government
Mid day meal scheme
Government school teachers
PM POSHAN scheme

More Telugu News