నేడు కూడా పెరిగిన పెట్రోలు ధర!

Petrol Price Hike Today
  • వరుసగా 14వ రోజూ పెరిగిన ధరలు
  • పెట్రోలుపై 51 పైసలు, డీజిల్ పై 61 పైసల ధర పెరుగుదల
  • హైదరాబాద్ లో రూ. 81.88కి పెట్రోలు ధర
గడచిన 13 రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు, 14వ రోజు కూడా పెరిగాయి. ఈ ఉదయం లీటరు పెట్రోలు ధరను 51 పైసలు, డీజిల్ ధరను 61 పైసల మేరకు పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోలు రూ. 78.88, డీజిల్ రూ.77.67కు చేరగా, ముంబయిలో పెట్రోలు రూ. 85.70, డీజిల్  రూ.75.11కు, చెన్నైలో పెట్రోలు ధర రూ. 82.27, డీజిల్  రూ.75.29కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్ లో పెట్రోలు  రూ. 81.88, డీజిల్ రూ.75.91కు, అమరావతిలో  పెట్రోలు  రూ. 82.27, డీజిల్ రూ.76.30కు పెరిగింది.
Go Back to Shorts
Petrol
Diesel
Price Hike

More Telugu News