ప్రతి 10 స్టార్టప్ కంపెనీల్లో 9 విలవిల్లాడుతున్నాయి: నాస్కామ్

9 Out of 10 Startups Bleeding in India
  • స్టార్టప్ లపై నెల రోజుల పాటు సర్వే నిర్వహించిన నాస్కామ్
  • మూతపడ్డ 30 నుంచి 40 శాతం కంపెనీలు
  • దారుణంగా దెబ్బతిన్న ట్రావెల్, ట్రాన్స్ పోర్ట్ స్టార్టప్ లు
భారతీయ స్టార్టప్ రంగంపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. ఇండియాలో ప్రతి 10 స్టార్టప్ కంపెనీల్లో 9 సంస్థలు విలవిల్లాడుతున్నాయని ఐటీ ట్రేడ్ బాడీ 'నాస్కామ్' తెలిపింది. స్టార్టప్ లపై నాస్కామ్ నెల రోజుల పాటు సర్వే నిర్వహించింది. దాదాపు 30 నుంచి 40 శాతం స్టార్టప్ లు పూర్తిగా లేదా తాత్కాలికంగా మూతపడ్డాయని సర్వేలో తేలింది. మిగిలిన 70 శాతం స్టార్టప్ లలో నిధులు మరో మూడు నెలల వరకు మాత్రమే సరిపోయే పరిస్థితి ఉంది.

250కి పైగా స్టార్టప్ కంపెనీలను నాస్కామ్ సర్వే చేసింది. ఇవన్నీ వైవిధ్యభరితమైన ప్రొఫైల్ కలిగి ఉన్న కంపెనీలు. 62 శాతం కంపెనీల రెవెన్యూలో 40 శాతం వరకు తగ్గుదల కనిపించింది. 34 శాతం కంపెనీలు మాత్రం ఆందోళనకర స్థాయిలో 80 శాతం రెవెన్యూని కోల్పోయాయి. దీనికంతా కారణ కేవలం కరోనా మహమ్మారే.

ట్రావెల్, ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించిన స్టార్టప్ లు దారుణంగా నష్టపోయాయి. వీటితో పాటు లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్ మెంట్ తదితర స్టార్టప్ లు కూడా రెవెన్యూలో తగ్గుదలను చవిచూశాయి. అయితే హెల్త్ కేర్, ఫైనాన్స్, విద్యకు సంబంధించిన స్టార్టప్ లు మాత్రం లాభాలను నమోదు చేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
Startups
India
Corona Virus

More Telugu News