నేరుగా తెలుగు సినిమా చేసే ప్రయత్నంలో సూర్య
- తెలుగులోను సూర్యకి క్రేజ్
- కొంతకాలంగా ఇక్కడ దక్కని సక్సెస్
- తెలుగు దర్శకులతో టచ్ లో వున్న సూర్య
ఈ నేపథ్యంలో నేరుగా తెలుగులోనే ఒక సినిమా చేసి ఇక్కడ తన స్థానాన్ని పదిలపరచుకోవాలనే ఆలోచనలో సూర్య వున్నాడు. కొంతకాలంగా ఇక్కడి రచయితలతో .. యువ దర్శకులతో ఆయన టచ్ లోనే వుంటున్నట్టుగా తెలుస్తోంది. వీలైనప్పుడల్లా ఆయన తెలుగు కథలను వింటున్నాడని అంటున్నారు. కథ నచ్చితే తన సొంత బ్యానర్లోనే చేయాలనే గట్టి నిర్ణయంతోనే ఆయన వున్నాడని చెబుతున్నారు. ఆయన ప్రయత్నం ఎప్పుడు ఫలిస్తుందో చూడాలి.