Pawan Kalyan: కాకినాడలో ప్రశాంత పరిస్థితులుంటే పవన్ పర్యటించడం ఎందుకో?: జక్కంపూడి రాజా

షార్ట్స్‌లో చూడండి
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనపై వైసీపీ నేత జక్కంపూడి రాజా విమర్శలు గుప్పించారు. కాకినాడలో ప్రశాంత పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన పర్యటించడం ఎందుకో? అని ప్రశ్నించారు. పవన్ రాజకీయాలు మానేసి మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. సీఎం జగన్ ని విమర్శించడమే పవన్ కల్యాణ్, చంద్రబాబు పని అని విమర్శించారు. నాడు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను నిర్బంధించినప్పుడు పవన్ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam

More Telugu News