Jagan: ఉగాది రోజున 24 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం: ఏపీ సీఎం జగన్ 

షార్ట్స్‌లో చూడండి
ఉగాది రోజున 24 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. సమాజంలో బలహీన వర్గాలకు సమాన అవకాశాలు ఉండాలని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళి అర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..  46 లక్షల రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇచ్చామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా కల్పించామని చెప్పారు. నాడు నేడు ద్వారా పాఠశాలలను ఆధునికీకరిస్తున్నామని జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పెడుతున్నామని చెప్పారు.

జనవరి 9న 'అమ్మ ఒడి' ద్వారా మహిళలకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ఉన్నత చదువుల కోసం పూర్తి ఫీజురీయింబర్స్ మెంట్ ఇస్తామన్నారు. వసతి దీవెన ద్వారా ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని తెలిపారు. పేద విద్యార్థుల చదువుకు ఎంతైనా ఖర్చు చేస్తామని చెప్పారు. అణగారిన వర్గాలకు సమాన హక్కు ఉండాలని జ్యోతిరావు పూలే పోరాటం చేశారన్నారు. బలహీన వర్గాల మహిళలు చదువుకోవాలని చెప్పారని అన్నారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News