మంత్రి కొడాలి అహంకారంతో నోటి కొచ్చినట్లు మాట్లాడుతున్నారు: టీడీపీ నేత దేవినేని ఉమ మండిపాటు
- వైసీపీ మంత్రులు ముందు తెలుగు భాషను నేర్చుకోవాలి
- రాజధాని అమరావతి నిర్మాణంపై సీఎం జగన్ ప్రకటన చేయాలి
- గ్రామాల్లో వైసీపీ నేతలు మద్యం అమ్ముతున్నారు
రాజధాని అమరావతి నగరం నిర్మాణంపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతిని గొంతు పిసికి చంపారన్నారు. గ్రామాల్లో వైసీపీ నేతలు మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. కౌలు రైతులలో కూడా కులాలు చూసిన ఘనత జగన్ దేనన్నారు. సిమెంట్ కంపెనీల వద్ద రూ.2,500 కోట్లకు బేరం ఆడింది నిజం కాదా ? తొలి విడతగా వెయ్యి కోట్లు తీసుకోలేదా ? అని ప్రశ్నించారు.