కోహ్లీ దుస్తులు నేను వేసుకోవడానికి కారణం ఇదే: అనుష్క శర్మ
- కోహ్లీ వార్డ్ రోబ్ లో ఎన్నో దుస్తులు ఉంటాయి
- నాకు నచ్చినవి తీసుకుని వేసుకుంటుంటాను
- నా భర్త దుస్తులు ధరించినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది
తన భర్త కోహ్లీ దుస్తులను దొంగిలించి వేసుకుంటానని అనుష్క తెలిపింది. కోహ్లీ వార్డ్ రోబ్ లో ఎన్నో దుస్తులు ఉంటాయని, వాటిలో తనకు నచ్చినవి తీసుకుని వేసేసుకుంటుంటానని చెప్పింది. ఎందుకంటే తన భర్త దుస్తులను ధరించినప్పుడు తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ జంట భూటాన్ లో షికారు చేస్తోంది. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.