అమ్మ విజయనిర్మలతో గీతాంజలికి ఎంతో అనుబంధం: మా అధ్యక్షుడు నరేష్
- సినీ పరిశ్రమ ఓ పెద్ద దిక్కును కోల్పోయింది
- ఎంతో కలుపుగోలుగా ఉండే మనిషి
- అసోసియేషన్ సభ్యులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తాను ఎప్పూడూ సంతోషంగా ఉంటూ, అందరితో కలుపుగోలుగా వ్యవహరించే మనిషి గీతాంజలి అన్నారు. మా సభ్యులందరి పట్ల ఎంతో అభిమానంతో ఉండేవారని, అటువంటి మంచి మనసున్న మనిషి మనల్ని వదిలి వెళ్లిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది భాషలతో పాటు హిందీతో కలిపి దాదాపు 500 చిత్రాల్లో గీతాంజలి నటించారు.