బాత్రూమ్‌లోకి వెళ్లి గంటల తరబడి బయటకు రాకపోతే.. ఇదే ‘వెపనైజ్డ్ పూపింగ్’!
- ‘వెపనైజ్డ్ పూపింగ్’ పదం సోషల్ మీడియాలో వైరల్
- బాత్రూమ్ బ్రేక్‌తో బాధ్యతలు తప్పించుకోవడమే దీని అర్థం
- ఫోన్ వాడకం వల్ల పెరుగుతున్న బాత్రూమ్‌లో ఉండే సమయం
- కొందరికి బాత్రూమ్ ప్రశాంతంగా ఉండే ప్రదేశం
- ఎక్కువసేపు టాయిలెట్‌పై కూర్చోవడం ఆరోగ్యానికీ మంచిది కాదంటున్న నిపుణులు
ఇంట్లో ఏదైనా పని చెప్పగానే.. “ఒక్క నిమిషం, బాత్రూమ్‌కు వెళ్లాలి” అని చెప్పి అక్కడికి వెళ్లడం. ఆ తర్వాత ఐదు నిమిషాలు.. పది నిమిషాలు.. అలా అరగంట దాటిపోయినా బయటకు రాకపోవడం. ఇలాంటి సన్నివేశాలు చాలా ఇళ్లలో కనిపిస్తుంటాయి. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో కూడా ఇదే సీన్ కనిపించొచ్చు.
బాత్రూమ్‌కు వెళ్లడం నిజమే. కానీ అక్కడ పని అయిపోయినా ఫోన్‌లో రీల్స్ చూడటం, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం, కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం మొదలవుతుంది. ఇలా బాత్రూమ్ విరామాన్ని ఇంటి పనుల నుంచి తప్పించుకునే మార్గంగా వాడటాన్నే ఇప్పుడు సోషల్ మీడియాలో ‘వెపనైజ్డ్ పూపింగ్’ అంటున్నారు.
‘వెపనైజ్డ్ పూపింగ్’ అంటే?
పేరు కాస్త వింతగా అనిపించినా.. ఇందులో ఎలాంటి ప్రమాదకరమైన విషయం లేదు. ‘వెపన్’ అంటే ఆయుధం. ఇక్కడ బాత్రూమ్ బ్రేక్‌నే ఒక ఆయుధంలా వాడుతున్నారన్నమాట.
ఉదాహరణకు ఇంట్లో పాత్రలు కడగమని చెప్పారనుకోండి. వెంటనే “బాత్రూమ్‌కు వెళ్లాలి” అంటూ అక్కడికి వెళ్లడం. పిల్లలకు తినిపించాల్సిన సమయం వచ్చినా ఇదే చెప్పడం. భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు కూడా బాత్రూమ్‌లోకి వెళ్లి వాగ్వాదాన్ని తప్పించుకోవడం. ఇలా బాధ్యతలు, ఇంటి పనులు లేదా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కాసేపు తప్పించుకునేందుకు టాయిలెట్ బ్రేక్‌ను ఉపయోగిస్తే దానిని ‘వెపనైజ్డ్ పూపింగ్’గా పిలుస్తున్నారు.
10 నిమిషాలు కాస్తా 40 నిమిషాలు
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఫోన్. నిజంగా బాత్రూమ్‌కు వెళ్లిన వ్యక్తి అక్కడ ఫోన్ తీస్తాడు. ఒక రీల్ చూస్తాడు. తర్వాత ఇంకోటి. అలా చూస్తుండగానే సమయం గడిచిపోతుంది. పది నిమిషాలు అనుకున్నది కాస్తా 40 నిమిషాలవుతుంది.
అయితే ప్రతిసారీ ఇది కావాలని చేస్తున్నారనడం కూడా సరికాదు. కొందరికి బాత్రూమ్ కాసేపు ఒంటరిగా ఉండే ప్రదేశంగా మారుతోంది. బయట ఇంట్లో పిల్లలు, పని, శబ్దం.. అన్నింటికీ దూరంగా కొన్ని నిమిషాలు ప్రశాంతంగా గడిపే అవకాశం అక్కడ దొరుకుతుంది.
ఈ పదం ఎలా వైరల్ అయింది?
రచయిత, డైవోర్స్ కోచ్ ఒలివియా హోవెల్ రాసిన ఓ వ్యాసంలో ఈ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. బాత్రూమ్‌కు వెళ్లడం సహజమైన విషయమే అయినా.. దానిని ఇంట్లో జరుగుతున్న పనుల నుంచి తప్పించుకునే మార్గంగా మార్చుకోవచ్చని ఆమె వివరించారు.
ఈ చర్చలో మహిళలపై ఉండే అదనపు బాధ్యతల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. తల్లులు బాత్రూమ్‌లో ఉన్నా, తింటున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా తమ కుటుంబానికి అందుబాటులో ఉండాలని ఆశించే పరిస్థితులు చాలాచోట్ల కనిపిస్తాయని హోవెల్ పేర్కొన్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
బాత్రూమ్.. కాస్త ‘మీ టైమ్’ కూడా!
ఇదే సమయంలో మరో కోణం కూడా ఉంది. ముఖ్యంగా జెన్-జీలో కొందరు బాత్రూమ్‌ను కాసేపు ప్రశాంతంగా కూర్చునే ప్రదేశంగా భావిస్తున్నారు. ఫోన్ చూడటం, ఆలోచనలు సర్దుకోవడం, బయట జరుగుతున్న హడావుడికి దూరంగా ఉండటం కోసం అక్కడ కొంత సమయం గడుపుతున్నారు.
బాత్రూమ్‌ను మరింత సౌకర్యంగా మార్చుకునే ‘టాయిలెట్స్‌కేపింగ్’ ట్రెండ్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఫ్యాన్సీ డెకర్, మెత్తని మ్యాట్స్, లైట్స్, జర్నల్స్ వంటి వాటితో బాత్రూమ్‌ను చిన్న రిలాక్సేషన్ స్పాట్‌లా మార్చుకుంటున్నారు.
ఎప్పుడు ఇది సమస్యగా మారుతుంది?
బాత్రూమ్‌లో ఎన్ని నిమిషాలు గడిపారన్నది అసలు సమస్య కాదు. ఆ సమయాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారన్నదే ముఖ్యం.
రోజంతా పని మధ్యలో కాసేపు ప్రశాంతంగా ఉండేందుకు కొన్ని అదనపు నిమిషాలు తీసుకోవడం సాధారణమే. కానీ ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు లేదా ఇబ్బందికరమైన సంభాషణల నుంచి తప్పించుకోవడానికి ప్రతిసారీ బాత్రూమ్‌ను ఆశ్రయిస్తే అది సమస్యగా మారొచ్చు.
ఇంకో విషయం ఆరోగ్యానికి సంబంధించినది. టాయిలెట్‌పై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మలద్వారం చుట్టూ ఒత్తిడి పెరిగి హెమరాయిడ్స్ (పైల్స్) వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణుల సూచనలు చెబుతున్నాయి. ఎక్కువసేపు అక్కడే కూర్చునే అలవాటు సాధారణ మల విసర్జన విధానాన్నీ ప్రభావితం చేయొచ్చు.
అందుకే.. బాత్రూమ్ మీకు కాసేపు ప్రశాంతంగా ఉండే ప్రదేశం కావచ్చు. కానీ ఇంటి బాధ్యతల నుంచి ప్రతిసారీ తప్పించుకునే ‘సేఫ్ జోన్’గా మారితే మాత్రం.. అదే ‘వెపనైజ్డ్ పూపింగ్’ అవుతుంది.