రోడ్డు ప్రమాదంలో మంత్రి గొట్టిపాటి డ్రైవర్ దుర్మరణం
- చిలకలూరిపేట బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- గొట్టిపాటి డ్రైవర్ శ్రీహరి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొన్న కారు
- తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయిన శ్రీహరి
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వద్ద వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్న తన్నీరు శ్రీహరి (33) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన శ్రీహరి, పోలిరెడ్డి పాలెం బైపాస్ రోడ్డుపై తన మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీహరి బైక్‌పై నుంచి ఎగిరిపడటంతో తల, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు.
శ్రీహరిని సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి అంకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ జరుపుతున్నారు.
చాలాకాలంగా తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న శ్రీహరి అకాల మరణం పట్ల మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో మంత్రి సిబ్బంది, స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.