పొరుగు రాష్ట్రంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనప్పుడు తెలంగాణలో సమస్య ఏంటి?: సురవరం
- ఆర్టీసీ సమ్మెపై స్పందించిన సురవరం
- కార్మికుల హక్కులను అణచివేసే ప్రయత్నమని ఆరోపణ
- డీజిల్ పై పన్నులు విధించడమే ఆర్టీసీ నష్టాలకు కారణమని వెల్లడి
హైదరాబాద్ సీపీఐ కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు సమ్మెకు మద్దతుగా దీక్ష ప్రారంభించగా, ఈ సందర్భంగా సురవరం వ్యాఖ్యానించారు. ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ నుంచి లాభాలు ఎలా ఆశిస్తారని నిలదీశారు. లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఆర్టీసీని నడిపించాల్సిందేనని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రం ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనప్పుడు తెలంగాణలో సమస్య ఏంటని ప్రశ్నించారు.