మోహన్ లాల్ కారణంగానే చరణ్ చేతికి 'లూసిఫర్' రైట్స్!
- మలయాళంలో హిట్ కొట్టిన 'లూసిఫర్'
- రీమేక్ హక్కులను ఎవరికీ ఇవ్వని నిర్మాతలు
- చరణ్ కి ఇప్పించిన మోహన్ లాల్
చిరంజీవి హీరోగా ఆ సినిమాను రీమేక్ చేయడానికి చరణ్ రంగంలోకి దిగాడు .. ఆ రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఈ విషయంలో మోహన్ లాల్ ఆయనకి హెల్ప్ చేసినట్టుగా తెలుస్తోంది. 'లూసిఫర్' నిర్మాతలు ఇతర భాషల్లోను తామే ఈ సినిమాను నిర్మించాలనే ఉద్దేశంతో ఎవరికీ ఇవ్వకుండా తమ దగ్గరే హక్కులను ఉంచుకున్నారట. అయితే ఈ రీమేక్ రైట్స్ కోసం చరణ్ ప్రయత్నిస్తున్నాడని మోహన్ లాల్ కి తెలిసి, ఆ నిర్మాతలను ఒప్పించి రైట్స్ ఇప్పించినట్టుగా చెప్పుకుంటున్నారు. చిరంజీవితో మోహన్ లాల్ కి గల సాన్నిహిత్యమే ఇందుకు కారణమని అనుకుంటున్నారు.