ఆహారంలో వెంట్రుకలు వచ్చాయని భార్యకు ఎలాంటి శిక్ష వేశాడో చూడండి!

  • బంగ్లాదేశ్ లో ఘటన
  • ఆహారంలో వెంట్రుకలు కనిపించడంతో భర్త ఆగ్రహం
  • భార్యకు బలవంతంగా శిరోముండనం
బంగ్లాదేశ్ లో ఓ వ్యక్తి ఆహారంలో వెంట్రుకలు వచ్చాయని భార్యకు గుండు చేశాడు. జోయ్ పుర్హత్ జిల్లాలోని బబ్లూ మోండాల్ తిండి తినేందుకు ఉపక్రమించాడు. అయితే ఆహారంలో వెంట్రుకలు కనిపించడంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయాడు. అనరాని మాటలు అన్న తర్వాత బ్లేడుతో ఆమెకు శిరోముండనం చేశాడు. ఆమె ఎంత ప్రతిఘటించినా లెక్కచేయకుండా గుండు కొట్టాడు. ఈ విషయం మానవ హక్కుల సంఘానికి తెలియడంతో బబ్లూ మోండాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గృహహింస కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బబ్లూ ఈ కేసులో దోషిగా తేలితే అతడికి 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.
Go Back to Shorts
Bangladesh
Wife
Hair

More Telugu News