Chiranjeevi: నిర్మాతగా చరణ్ చేతికి మరో భారీ ప్రాజెక్ట్

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున హీరోగా విభిన్నమైన చిత్రాలను చేస్తూనే, మరో వైపున నిర్మాతగా చరణ్ భారీ ప్రాజెక్టులను తెరపైకి తెస్తున్నాడు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన 'సైరా' వచ్చేనెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చరణ్ మరో భారీ ప్రాజెక్టును సొంతం చేసుకున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'లూసిఫర్' అక్కడ ఘన విజయాన్ని దక్కించుకుంది. మోహన్ లాల్ స్థాయిని మరింతగా పెంచిన చిత్రంగా నిలిచింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ దక్కించుకున్నాడట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టును కూడా ఆయన చిరంజీవితోనే చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
Chiranjeevi
Charan
Mohanlal

More Telugu News