చిక్కుల్లో లక్ష్మీ విలాస్ బ్యాంకు.. భారీ కుట్ర జరిగిందంటూ రెలిగేర్ ఫిర్యాదు
- తాము చేసిన రూ.790 కోట్ల డిపాజిట్ దుర్వినియోగమైందని ఆరోపణ
- కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
- డైరెక్టర్లపై మోసం, నమ్మక ద్రోహం, నేరపూరిత కుట్ర ఆరోపణలు
తాము చేసిన డిపాజిట్ దుర్వినియోగం వెనక భారీ కుట్ర ఉన్నట్టు అనిపిస్తోందని రెలిగేర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఎల్‌వీబీ కేంద్రంగా ఇది నడిచినట్టు ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలు మొత్తం బ్యాంకు బోర్డుపైనా, లేక కొందరు డైరెక్టర్లపైనేనా అన్నది తెలియరాలేదు. ఎల్‌వీబీపై ఫిర్యాదుతో ఆ బ్యాంకు షేర్లు ఒక్కసారిగా పతనం చెందాయి. ఎన్ఎస్‌ఈలో షేరు విలువ రూ.36.50 వద్ద, బీఎస్‌ఈలో రూ.36.55 వద్ద ముగిసింది.