సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- నిర్మాతకు సాయం చేసిన అమలాపాల్
- రవితేజ సినిమాలో బాబీ సింహా
- కృష్ణవంశీతో బండ్ల గణేష్ ప్రాజక్ట్
* రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డిస్కో రాజా' చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. కాగా, తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకి గాను తమిళ నటుడు బాబీ సింహాను తీసుకున్నారు. ఇందులో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
* గత కొన్నాళ్లుగా వెనుకబడిపోయిన దర్శకుడు కృష్ణవంశీ 'రుద్రాక్ష' సినిమాతో మళ్లీ మెగాఫోన్ పట్టనున్నాడంటూ ఇటీవల వార్తలు రావడం, అందులో వాస్తవం లేదని ఆయన ఖండించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేశ్ ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.