చంద్రుడి రహస్యాలపై కన్ను.. చంద్రయాన్-2 ప్రయోగ తేదీని ఖరారు చేసిన ఇస్రో!
- జూలై 15న ప్రయోగం చేపట్టాలని నిర్ణయం
- జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా ప్రయోగం
- ల్యాండర్, రోవర్, ఆర్బిటర్ ను పంపనున్న ఇస్రో
జీఎస్ఎల్వీ మార్క్-3 వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపడతామని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా మూడు పరికరాలు.. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లు ఉంటాయన్నారు. చంద్రయాన్-2 వ్యవస్థ మొత్తం బరువు 3447 కేజీలు కాగా, వీటిలో ఒక్క ప్రొపెల్లర్ బరువే ఏకంగా 1179 కేజీలు ఉంటుందని చెప్పారు. ఓసారి ఉపగ్రహాన్ని ప్రయోగించాక, ఇది స్వతంత్రంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6 లేదా 7 తేదీల్లో ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందని వెల్లడించారు.