నేనున్నాను అంటూ పవన్ వెనుక అలీ రావలసింది: 'గబ్బర్ సింగ్' సాయి

  • పవన్ కల్యాణ్ గారితో అలీకి ఎంతో సాన్నిహిత్యం వుంది 
  • పవన్ కల్యాణ్ గారి సినిమాల్లో అలీకి అవకాశాలు దక్కాయి
  • అలీ అవన్నీ మరిచిపోవడం కరెక్ట్ కాదు
పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్' సినిమాలో కామెడీ రౌడీ గ్యాంగ్ గా కనిపించినవాళ్లకి ఎంతో గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి వాళ్లు పవన్ కల్యాణ్ ను వదిలిపెట్టలేదు. తాజా ఇంటర్వ్యూలో 'గబ్బర్ సింగ్' సాయి మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ను మేము చాలా దగ్గరగా చూస్తూ వచ్చాము. ఆయనది ఎంత మంచి మనసు అనే విషయం మాకు తెలుసు. అందువల్లనే 'జనసేన' తరఫున ఇంటింటికి తిరిగి ప్రచారం చేశాము.

మాకంటే పవన్ కల్యాణ్ గారితో అలీకి వున్న సాన్నిహిత్యం ఎక్కువ. అలాంటి అలీని పార్టీలోకి రమ్మని పవన్ కల్యాణ్ గారు పిలవాలా? 'అన్నా నేనున్నాను .. ఏం చేయాలో చెప్పు' అంటూ అలీ రావలసింది. పవన్ కల్యాణ్ గారి సినిమాల్లో ఆయన కారణంగా అవకాశాలు సంపాదించుకుని, ఆయనకి కౌంటర్ గా వీడియో పెట్టాడు. అలీ ఈ విధంగా చేయడం ఆయనకే నష్టం .. పవన్ కల్యాణ్ గారికి జరిగే నష్టం ఏమీ లేదు. ఇండస్ట్రీలో ఇలాంటివాళ్లు ఎంతమంది సపోర్ట్ చేయకపోయినా పవన్ కల్యాణ్ గారికి ఏమీ కాదు" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
gabbar singh sai

More Telugu News