ఏం అబ్జెక్షన్ నీది? యూ ఆర్ అన్ ఫిట్ ఫర్ ఎమ్మెల్యే: విష్ణుకుమార్ రాజుపై భగ్గుమన్న చంద్రబాబు
- చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకున్న విష్ణుకుమార్ రాజు
- కట్టలు తెంచుకున్న చంద్రబాబు ఆగ్రహం
- న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టబోనని హెచ్చరిక
ఈ సమయంలో 'అబ్జెక్షన్' అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనగా చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. "ఏం అబ్జెక్షన్ నీది? ఏం అబ్జెక్షన్ చేస్తావు? యూ ఆర్ అన్ ఫిట్ ఫర్ ఎమ్మెల్యే. తమాషాగా ఉందా? నీ అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? అబ్జెక్షనా..? న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టను. తిరగనివ్వను మిమ్మల్ని. వినేవాళ్లుంటే చెవుల్లో పూలు పెడతారండీ వీళ్లు" అని అన్నారు.