మా అమ్మ అంతగా చదువుకోనప్పటికీ మంచి తెలివి తేటలున్నాయి: ప్రధాని మోదీ
- మా అమ్మకు వైద్య మెళకువలు తెలుసు
- తన పూర్వీకుల నుంచి అవి సంక్రమించాయి
- చిన్న పిల్లలకు వచ్చిన జబ్బులను నయం చేసేది
అమ్మ వైద్యం కోసం బారులు తీరేవారు: మా అమ్మకు తన పూర్వీకుల నుంచి సంక్రమించిన వైద్య మెళకువలతో, సంప్రదాయ పద్ధతుల ద్వారా చిన్న పిల్లలకు వచ్చిన జబ్బులను నయం చేసేది. ఆమె అంత బాగా చదువుకోకపోయినప్పటికీ ఆ దేవుడు మంచి తెలివితేటలిచ్చాడు. ఆమె చేసే వైద్యం కోసం తమ పిల్లలతో ఎంతో మంది తల్లులు మా ఇంటి ముందు ఉదయానికల్లా బారులు తీరి ఉండేవారు.